MDK: రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు జరగాలని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి సూచించారు. తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో శనివారం సాయంత్రం వారి ధాన్యం కొనుగోళ్లపై అవగాహన శిక్షణ చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో సదుపాయాలు, అవసరాలు సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.