కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం పీఠాధిపతి ఎంపిక అభిప్రాయ సేకరణ మంగళవారం అధికారులు నిర్వహించారు. తమ అభిప్రాయాన్ని తెలియజేయుటకు స్వామివారి భక్తులు, శిష్యులు, బ్రహ్మంగారిమఠం మండల చుట్టూ ఉన్నటువంటి గ్రామస్తులు జోరు వాన, తుఫాను కూడా లెక్కచేయకుండా భారీ స్థాయిలో తరలివచ్చి వినతులు సమర్పించారు.