JGL: వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు. గురువారం పెగడపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు జూన్ 2కు పూర్తయి, గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.