SRCL: వేములవాడ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఎకనామిక్స్, అర్ధశాస్త్రం విభాగంలో అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన మహిళాభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లావణ్య తెలిపారు. సంబంధిత పీజీలో 50 శాతం ఉత్తీర్ణతతో పాటు నెట్, సెట్ లేదా పీహెచ్ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈనెల 15లోగా సంప్రదించాలన్నారు.