MDK: రామాయంపేట మండలం దామరచెరువు గ్రామ శివారులోని పాత జాతీయ రహదారి పక్కన చెత్త, కుళ్లిపోయిన చికెన్ వ్యర్ధాలు వేసే వారిపై చర్య తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి జోత్స్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన చెత్తను గ్రామ శివారులో వేస్తున్నారని తద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులతో కలిసి నేడు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.