ADB: దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా.బాబు జగ్జీవన్ రామ్ అని TTF రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ చంద్రకాంత్ అన్నారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పలువురు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. దేశానికి ఎంతో సేవలు చేసిన జగ్జీవన్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.