NZB: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TU విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది గురువారం రిజిస్ట్రార్ చాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. టైమ్ స్కేల్ వేతనాలు వర్తింపజేయాలని, ప్రతి నెలా పీఎఫ్, ఈఎస్ఐ సకాలంలో జమ చేయాలని కోరారు. లోకల్ ఏజెన్సీ కాకుండా రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారానే జీతాలు చెల్లించాలని, బయోమెట్రిక్ విధానాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.