HNK: అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. KUDA కార్యాలయంలో భద్రకాళి ఆలయ అభివృద్ధిలో భాగంగా మాడ వీధుల నిర్మాణం కారణంగా ఇళ్లను కోల్పోతున్న భూ-నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు.