NGKL: జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. గత 24 గంటల్లో తాడూరులో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అచ్చంపేట, లింగాల, కల్వకుర్తిలోనూ 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం అల్లాడిపోతున్నారు. పెంట్లవెల్లి, చారకొండ, బల్మూర్ తదితర మండలాల్లోనూ ఎండలు ముదురుతున్నాయి. పెరుగుతున్న వేడితో జిల్లా ఉడికిపోతుండగా ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.