NLG: తెలంగాణ మాజీ ఫారెస్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ ఇటీవలే మరణించగా… శనివారం ఉమ్మడి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. నకిరేకల్, మునుగోడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి జగదేవ్ పూర్ మండలం దౌలాపూర్ వెళ్లి వంటేరును పరామర్శించారు.