SRD: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్పి మాట్లాడుతూ.. గాంధీ చూపిన అహింసా మార్గంలో ప్రతి ఒక్కరూ ప్రయాణించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు, పోలీసులు పాల్గొన్నారు.