NTR: విజయవాడ ఎంజీ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో “స్వచ్ఛతాన్ 10కే మారథాన్” గురువారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ సినీ హీరో శర్వానంద్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణ ప్రజలు శుభ్రతలో ఆదర్శంగా నిలవాలని కోరారు. యువత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.