JN: గాంధీ సిద్ధాంతాలు నేటికీ సమాజానికి మార్గదర్శకం అని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సత్యం, అహింస, సేవా భావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.