KRNL: ఖైదీలు సత్ప్రవర్తనతో జాతిపిత మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి బాటలో నడవాలని కలెక్టర్ డా.ఏ.సిరి సూచించారు. గురువారం పంచలింగాల గ్రామ సమీపంలోని జిల్లా కారాగారంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి లీలావెంకట శేషాద్రిలు పాల్గొన్నారు.