BHNR: చౌటుప్పల్, 9వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో ఇవాళ నిర్వహించిన గ్రాడ్యుయేషన్ వేడుకకు మున్సిపల్ ఛైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో ఆటపాటల ద్వారా పిల్లలకు మానసిక వికాసం, సృజనాత్మకత పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.