BHNG: జిల్లా కేంద్రంలోని శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 134వ ఉచిత మెగా వైద్య శిబిరం భువనగిరి పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ నందు శనివారం నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రోనక్ దినేష్ సోనీచే ఉచిత కన్సల్టేషన్ నిర్వహించి డాక్టర్ సలహా మేరకు సిబ్బందికి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు.