MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నామని ఆలయ ఈవో శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7న సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకొని ప్రధాన దేవాలయం, అన్ని దేవాలయాలను మూసివేస్తామన్నారు. సెప్టెంబర్ 8న దేవాలయంలో సంప్రోక్షణ అనంతరం దేవాలయాన్ని తెరుస్తామన్నారు.