MBNR: అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో ఈనెల 15న ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించబడనుంది. జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఈ శిబిరంలో ప్రముఖ నేత్ర వైద్యులు పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నారు.