ASF: తెలంగాణలో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారనే ఆందోళనల మధ్య ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది. గంజాయి, కొకైన్, మెఫెడ్రోన్ వంటి ప్రమాదకర మాదకద్రవ్యాలు పాన్ షాపుల్లో కూడా సులభంగా లభిస్తున్నాయని ఆరోపిస్తూ సిర్పూర్ MLA పాల్వాయి హరీష్ బాబు అసెంబ్లీలో వాయిదా తీర్మానం సమర్పించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం పెరుగుతూ యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని అన్నారు.