MHBD: తొర్రూరు మండలం కంటాయపాలెం గ్రామంలో BRS పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. BRS పార్టీ సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్ ఎర్రం రాజు ఇవాళ TPCC రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ చేపట్టుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఆయన తెలిపారు.