HNK: చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని సెంట్రల్ జోన్ డీసీపీ కవిత సూచించారు. ఇవాళ జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఆమె మాట్లాడారు. రాజీ మార్గమే రాజ మార్గమని కక్షిదారులు తమ కేసులను రాజీ మార్గం ద్వారా కుదుర్చుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.