HYD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 భద్రతా ఏర్పాట్లపై డీజీపీ శివధర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. సమ్మిట్ కోసం సుమారు 6,000 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచినట్లు తెలిపారు. సభా వేదిక, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను కవర్ చేస్తూ ఏడీజీపీలు, ఐజీలు,10 మంది ఐపీఎస్ అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.