KMM: కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఖమ్మం సుందరయ్య భవన్ లో ఆయన చిత్రపటానికి జిల్లా నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు మాట్లాడుతూ…ప్రజా సమస్యల పరిష్కారానికి ఏచూరి అందించిన పోరాట పటిమతో కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. ఏచూరి జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.