ADB: బ్యాంకు సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, DCCB చైర్మన్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ను సోమవారం కలెక్టర్ సందర్శించారు. బ్యాంకులో అందిస్తున్న సేవలు, సిబ్బంది పనితీరు, ఖాతాదారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర పరిపాలన సంబంధిత అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.