NLG: కోదాడ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని (TS 29 T 3458) చిట్యాల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 9 ఆవులను కబేళాకు తరలిస్తున్న డ్రైవర్ షేక్ జానీ పాషా, యజమాని వేముల అనిల్ కుమార్లపై కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్సై రవికుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆవులను సురక్షితంగా గోశాలకు తరలించారు.