MBNR: ఎండలు పెరుగుతుండటంతో గొర్రెల కాపరులు వలస బాట పట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వేలాది గొర్రెలతో జోగులాంబ గద్వాల నడిగడ్డకు చేరుతున్నారు. నల్లరేగడి పొలాల్లో మేత పుష్కలంగా లభిస్తుందని, మూడు నెలలు ఇళ్లకు దూరంగా ఉండి గొర్రెలను మేపుతామని చెబుతున్నారు. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల నుంచి ఎక్కువగా కాపరులు వస్తున్నారు.