HNK: శాయంపేటలో బీజేపీ జిల్లా నాయకులు లడే శివ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు సత్యపాల్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి మాట్లాడుతూ… బీజేపీ పార్టీని రామచందర్ రావు నాయకత్వంలో అధికారంలో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేద్దామని అన్నారు.