MDK: రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. మెదక్ ఐడీఓసీలో విత్తన డీలర్లు, సహకార సంఘాలు, ఎఫ్పీఓల ప్రతినిధులతో ఆయన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. విత్తన పంపిణీలో ఎక్కడా నకిలీలకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అలాగే ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.