సూర్యాపేట: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం జిల్లా కేంద్రంలోని హోటల్ వ్యాపారంపై తీవ్రంగా పడింది. గ్యాస్ సిలిండర్ల కొరతతో పట్టణంలోని పలు టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. గ్యాస్ బుక్ చేద్దామన్నా సర్వర్ సమస్యలతో బుకింగ్లు కావడం లేదని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కొందరు వ్యాపారులు బొగ్గు పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.