NLG: మిర్యాలగూడ మండలం యాద్గార్ పల్లికి చెందిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కన్నెకంటి రంగయ్య (108) మృతి పట్ల సీపీఎం జిల్లా కమిటీ తీవ్ర సంతాపం తెలిపింది. జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బికారి మల్లేశం, నారి ఐలయ్య, వెంకటేశ్వర్లు, బండ శ్రీశైలం, నాగార్జున, ప్రభావతి సంతాపం తెలిపారు.