RR: కొత్తూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో పీపీఈ కిట్లు పంపిణీ చేసి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, ప్రభుత్వ వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.