BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని జనని మండల సమాఖ్య మహిళా సంఘాల సభ్యులు ఇవాళ MLA గండ్ర సత్యనారాయణను HNK నక్కలగుట్టలోని స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత సౌకర్యాలు, బస్సులు, మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా స్వావలంబన కల్పిస్తుందని ఆయన తెలిపారు.