ASF: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని మండల అభివృద్ధి అధికారి బండారు ప్రవీణ్ అన్నారు. బెజ్జూర్ సర్పంచ్ సరోజ దుర్గం తిరుపతి, పంచాయతీ కార్యదర్శి మీసారీ వైకుంఠంతో కలిసి గురువారం ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు చూపిన కొలతల ప్రకారం నాణ్యతతో నిర్మించుకోవాలన్నారు. లబ్ధిదారులు మధ్య దళారులను మోసపోవద్దని ఆయన సూచించారు.