SRD: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కొండాపూర్ మండలం పల్లి గ్రామంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొక్కలు నాటుకోవాలని చెప్పారు. ప్రజలకు అవసరమైన పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.