PDPL: రామగుండంలో ఎన్టీపీసీ జ్యోతి భవన్లో రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ ఎన్టీపీసీ అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అధికారులు చేపట్టిన పనుల వివరాలను తెలుసుకుని, పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.