MNCL: ఉపాధ్యాయులు ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయాలని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని బస్టాండ్ ప్రభుత్వ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శైలజ ఉన్నారు.