MHBD: మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కాంట్రాక్టు ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, క్రమబద్ధీకరించాలని కోరుతూ.. వారు విధులను బహిష్కరించారు. అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణం చెల్లించాలని, అలాగే 64వ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.