KMR: గాంధారి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి షేక్ సలాం శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో తరగతుల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల హాజరు, ఆన్లైన్ బోధన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా తరగతులకు వెళ్లి ఆన్లైన్లో జరుగుతన్న బోధనా విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.