CTR: వెదురుకుప్పం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం GD నెల్లురు నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు ఎమ్మెల్యే థామస్ రూ.61.95 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా ఉంటుందని ఆయన భరోసా కల్పించారు. నియోజకవర్గంలోని 395 స్వయం సహాయక సంఘం సభ్యులకు మెగా చెక్కును ఎమ్మెల్యే అందించారు.