VZM: జిల్లా కలెక్టర్ అంబేద్కర్‌కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా నుంచి బదిలీ అయిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ అంబేద్కర్ తమ విధుల నుంచి వైదొలిగారు. పలువురు జిల్లా అధికారులు, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నాయకులు, ఉద్యోగులు, సిబ్బంది కలెక్టర్‌కి అభినందనలు తెలిపి, సత్కరించారు.