ADB: గాదిగూడ మండలంలో శుక్రవారం రూ.లక్ష 60 వేల గంజాయి పట్టుకున్నట్లు సీఐ ప్రభాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సారుగూడ గ్రామానికి చెందిన మర్సుకోల జంగు తన వ్యవసాయ పొలంలో గంజాయి సాగు చేస్తున్నట్లు పక్క సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారన్నారు. మొత్తం 16 గంజాయి మొక్కలు స్వాధీనం చేశామన్నారు.