మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లాలోని ఎంపీడీవోలు,తహసీల్దారులతో వెబ్ఎక్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.