JGL: మెట్పల్లి పట్టణంలో శనివారం శివభక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి సంకు ఆశాలు తన తండ్రి గంగారాం పేరుతో రూ. 51,000 విరాళం ఇచ్చారు. పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షుడు ద్యావనపల్లి రాజారాం కుటుంబానికి శివభక్త మార్కండేయ స్వామి, గణపతి స్వామి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ విరాళంతో వారు మందిర పునర్నిర్మాణంలో రాజపోషకులుగా సభ్యత్వం పొందారు.