ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట వద్ద ఇవాళ తెల్లవారుజాము జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ అదుపుతప్పి కిందపడటంతో బాధితుడి తలకు బలమైన గాయమై రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించగా వారు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.