MHBD: మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు డోర్నకల్ పట్టణంలోని లోతట్టు ప్రదేశాలు వర్షపు నీటిలో మునిగాయి. బుధవారం స్థానిక ఎస్సై ఖాదర్ బాషా, పోలీస్ సిబ్బందితో కలిసి ఈ ప్రాంతాలను పరిశీలించారు. SI మాట్లాడుతూ.. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు ఉండకూడదని హెచ్చరించారు. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.