ADB: గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఎస్సై విష్ణుప్రకాష్ బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా మహాలక్ష్మీవాడకు చెందిన మసూద్, మహారాష్ట్రకు సల్మాన్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా రూ.6,075 విలువైన 243 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు.