బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇండి కూటమిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దేశాన్ని విడగొట్టేలా మాట్లాడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 140 కోట్ల జనాభాకు తగిన ప్రాతినిధ్యం పెంచేందుకే డీలిమిటేషన్ తెచ్చామని, అయితే ప్రధాని మోదీకి క్రెడిట్ వెళ్తుందన్న భయంతోనే విపక్షాలు దీనిని అడ్డుకుంటున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని వారు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.