HYD పాతబస్తి మెట్రో సంబంధించిన పనులపై MD NVS రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటికే భవన నిర్మాణాలకు కూల్చివేత సాగుతుండగా, రూ.433 కోట్ల పరిహారం విడుదల చేసినట్లు ప్రకటించారు. ప్రత్యేక నోటీసులో ఈ వివరాలు తెలిపిన అధికారులు, ఇప్పటి వరకు పాతబస్తి మెట్రో రూట్లో దాదాపుగా 550 భవన నిర్మాణాల కూల్చివేత పూర్తయినట్లుగా వెల్లడించారు.