NLR: నెల్లూరులోని అనంతసాగరం బస్టాండ్ సెంటర్లో గల హజరత్ మస్కూర్ అలీషా ఖాదరి దర్గా గంధ మహోత్సవం పోస్టర్ను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 16న జరిగే ఈ కార్యక్రమానికి దర్గా నిర్వాహకులు మంత్రిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు ఎం. కృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.