ప్రకాశం: అంకితభావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి మంచి గుర్తింపు ఉంటుందని మార్కాపురం రూరల్ SI అంకమ్మరావు అన్నారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ASI శ్రీనివాస్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. గుంటూరు జిల్లాకు SIగా శ్రీనివాస్ బదిలీ కావడంతో ఎస్సై తోటి సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసేది పోలీస్ ఉద్యోగి మాత్రమే అన్నారు.